న్యూఢిల్లీ, డిసెంబర్ 29: ఇప్పటికే భారీ స్థాయిలో సిబ్బందిని తొలగించిన గోల్డ్మన్ సాక్స్.. మరో 4 వేల మందిపై వేటువేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తున్నది. నిరాశాజనక ఆర్థిక ఫలితాలు నమోదుకావడంతో ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా మరి కొంతమంది సిబ్బందిని తొలగించాలనుకుంటున్నట్లు కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి డేవిడ్ సోలోమాన్స్ తెలిపారు.
మూడో త్రైమాసికం ముగిసేనాటికి సంస్థలో 49,100 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.