న్యూఢిల్లీ, ఆగస్టు 23: అంతర్జాతీయ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్..భారత్‌కు గట్టి షాకిచ్చింది. ప్రస్తుత, వచ్చే ఏడాదిలో వృద్ధి అంచనాల్లో కోత విధించింది. 2024లో 6.7 శాతం మాత్రమే వృద్ధిని సాధించనున్న భారత్.. ఆ తర్వాతి ఏడాది 6.4 శాతానికి పరిమితం కానున్నదని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఖర్చులను తగ్గించుకోవడానికి అధిక ప్రాధాన్యతనివ్వడం ఇందుకు కారణమని విశ్లేషించింది. సార్వత్రిక ఎన్నికలు జరగడంతో ఈ ఏడాది మొత్తం ప్రభుత్వం పెట్టే ఖర్చు భారీగా తగ్గిందని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజ ఆర్థికవేత్త సంతను సేన్‌గుప్తా రాసిన నివేదికలో వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 4.5 శాతానికి కట్టడి చేయడానికి ప్రభుత్వ నిర్ణయం వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నదన్నారు.