Gold price: దేశంలో బంగారం, వెండి ధరల్లో ఇవాళ స్వల్ప హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.264 తగ్గి రూ.46,140కి చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర 46,404కు పెరిగింది. గ్లోబల్ ట్రెండ్స్‌కు అనుగుణంగానే దేశీయంగా కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక, వెండి ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.22 పెరిగి రూ.63,486కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధర రూ.63,464 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర 1,798 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 24.37 అమెరికన్ డాలర్లు పలికింది.