న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో చాలా రోజుల తర్వాత బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారట్ బంగారం ధర రూ.1,130 తగ్గి రూ.45,207కు దిగివచ్చింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,337 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా రాత్రికిరాత్రే విలువైన లోహాల ధర తగ్గడం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు కూడా ఇవాళ దిగొచ్చాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.708 తగ్గి రూ.60,183కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.60,891 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,762 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.95 అమెరికన్ డాలర్లు పలికింది. ఇక హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. 24 క్యారట్ గోల్డ్ ధర 10 గ్రాములు రూ.48,330 ఉండగా, 22 క్యారట్ బంగారం 10 గ్రాముల ధర 44,300గా ఉన్నది.