Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. అంతర్జాతీయంగా బలహీనమైన డిమాండ్ కారణంగా రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం ధర రూ.170 తగ్గి తులానికి రూ.1,01,370కి చేరుకుంది. 22 క్యారెట్స్ బంగారం ధర రూ.150 తగ్గి.. రూ.1,00,550కి చేరుకుంది. వెండి ధర రూ.1,000 పతనమై.. కిలోకు రూ.1,07,100కి చేరింది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ధ్రువీకరించింది.
ఫ్యూచర్స్ ట్రేడ్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో ఆగస్టు నెలలో అత్యధికంగా ట్రేడ్ అయిన బంగారం కాంట్రాక్ట్ పది గ్రాములకు రూ.358 తగ్గి రూ.99,918 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో ఉదయం సెషన్లో 10 గ్రాములకు రూ.802 పెరిగి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి రూ.1,01,078కి చేరుకుంది.
భారతదేశం-యూఎస్, భారతదేశం-చైనా, యూఎస్-యూరోపియన్ ప్రాంతాల మధ్య అనేక సంభావ్య వాణిజ్య ఒప్పందాల వార్తల తర్వాత లాభాల బుకింగ్ కనిపించిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ రీసెర్చ్ అనలిస్ట్ (కమోడిటీ అండ్ కరెన్సీ) జతిన్ త్రివేది తెలిపారు. దాంతో బంగారం దాదాపు రూ.99,800 పరిధిలో పరిమిత పరిధిలో ట్రేడవుతోంది. సురక్షిత పెట్టుబడికి డిమాండ్ లేకపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం స్వల్పంగా మెరుగుపడింది.
ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 13.23 డాలర్లు తగ్గి ఔన్సుకు 3,419.41 డాలర్లకు చేరుకుంది. అబాన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా మాట్లాడుతూ బంగారం ధరలో స్వల్ప మెరుగుదల ఉన్నప్పటికీ.. అది రికార్డు స్థాయిలోనే ఉందని చెప్పారు. ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా పసిడి పెట్టుబడిదారులు బంగారం వైపు దృష్టి పెడుతున్నారన్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న అనిశ్చితి బులియన్ ధరలకు మంచి మద్దతునిస్తుందని వ్యాపారులు నమ్ముతున్నారని మెహతా అన్నారు.
కోటక్ సెక్యూరిటీస్‌లోని కమోడిటీ రీసెర్చ్ ఏవీపీ కైనత్ చైన్వాలా ప్రకారం… ఈ వారం పెట్టుబడిదారులు యూఎస్ ఫెడరల్ బ్యాంక్ ద్రవ్య విధానం.. వివిధ నిర్ణయాలపై నిఘా ఉంటుందని పేర్కొన్నారు. బుధవారం జరిగే సెంట్రల్ బ్యాంక్ సమావేశం వడ్డీ రేట్లను తగ్గించడం గురించి మార్గదర్శకత్వం అందిస్తుందని ఆయన అన్నారు. ఇక హైదరాబాద్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 22 క్యారెట్ల పసిడి రూ.93,050 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.1,01,510 ధర పలుకుతుంది. ఇక కిలో వెండి ధర రూ.1,19,900 పలుకుతున్నది.