Gold Price Hike | బంగారం కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. ప్రపంచ మార్కెట్లో డిమాండ్ నేపథ్యంలో ధరలు పెరిగాయి. ఢిల్లీలో ధర రూ.580 పెరిగి తులానికి రూ.97,030కి చేరిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. 99.5శాతం ప్యూరిటీ గోల్డ్ ధర సైతం తులానికి రూ.580 పెరగడంతో అన్ని పన్నులతో సహా ధర రూ.96,580కి చేరింది. మూడీస్ యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను తగ్గించింది. అదే సమయంలో యూఎస్ ట్రెజరీ రాబడి 4.5శాతానికి దగ్గరా ఉన్నది. శుక్రవారం రేటింగ్ ఏజెన్సీ మూడీస్ యూఎస్ క్రెడిట్ రేటింగ్‌ను ఏఏఏ నుంచి ఏఏ1కి తగ్గించిన సమయంలో కనిపించిన ర్యాలీ విస్తరించిందని అబాన్స్ ఫైనాన్సియల్ సర్వీసెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ చింతన్ మెహతా తెలిపారు. పెట్టుబడిదారులు యూఎస్ ట్రెజరీలో పెట్టుబడులను తగ్గించి.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఆసక్తి పెరిగిందన్నారు. ఇక వెండి ధర సైతం పెరిగింది. రూ.500 పెరిగి కిలోకు రూ.98,500 చేరింది.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అత్యధికంగా ట్రేడ్ చేయబడిన బంగారు ఫ్యూచర్స్ ఒప్పందం 10 గ్రాములకు రూ.1,182 లేదంటే.. 1.28 శాతం పెరిగి రూ.93,623కి చేరుకుంది. జూలైలో కమోడిటీ ఎక్స్ఛేంజ్లో డెలివరీ కోసం వెండి ఫ్యూచర్స్ రూ.662 పెరిగి కిలోకు రూ.95,980కి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 39.05 డాలర్లు 3,241.82 డాలర్లకు ఎగిసింది. యూఎస్ మాన్యుఫ్యాక్చరింగ్ డేటా పీఎంఐ, హౌసింగ్ డేటా వంటి యూఎస్ స్థూల ఆర్థిక డేటాపై మార్కెట్ దృష్టి ఉంటుందని జేఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రణవ్ మెర్ తెలిపారు. గోల్డ్‌మన్ సాచ్స్ ప్రకారం.. 2025 చివరి నాటికి బంగారం ధర ఔన్సుకు 3,700కి పెరుగుతుంది. ఎందుకంటే కేంద్ర బ్యాంకులు ప్రతి నెలా టన్నులకొద్ది బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉంటాయి. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు కోతల అంచనాలు, పెరుగుతున్న మాంద్యం ఆందోళనల మధ్య ఈటీఎఫ్ ETF పెట్టుబడిదారులు తమ హోల్డింగ్లను పెంచుతున్నందున ధర కూడా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక మాంద్యం ఏర్పడితే బంగారం ధరలు ఔన్సుకు 3,880కి చేరుకోవచ్చని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థ గోల్డ్‌మన్ సాచ్స్ ఒక నోట్లో పేర్కొంది.