Gold Rate | పసిడి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇస్తున్నాయి. వరుసగా ఐదో సెషన్లో ధరలు పెరిగాయి. సోమవారం మార్కెట్లో 24 క్యారెట్స్ గోల్డ్ రూ.100 పెరిగి.. తులానికి రూ.80,660కి చేరింది. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో బంగారం ధర రూ.1,660 వరకు వరకు పెరిగింది. ముడి చమురు ధరల పెరుగుదల నేపథ్యంలో రూపాయి బలహీనపడింది. దాంతో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రష్యాపై విధించి కొత్త ఆంక్షల కారణంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దాంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అలాగే, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో చాలామంది మంది బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు.
దీనికి తోడు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తుండడంతో బంగారం ధర విపరీతంగా పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.73,550కి చేరింది. 24 క్యారెట్ల పసిడి రూ.80,220 మార్క్‌ని దాటింది. చెన్నైలో 22 క్యారెట్స్ పసిడి రూ.73,400 ఉండగా.. 24 క్యారెట్స్ బంగారం రూ.80,070కి చేరింది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం రూ.73,400 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.80,070కి పెరిగింది. ఇక వెండి ధర సైతం భారీగా పెరిగింది. రూ.వెయ్యి పెరిగి.. కిలోకు రూ.1.02లక్షలు పలుకుతున్నది.