Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.100 పెరిగి రూ.62,750 వద్ద స్థిర పడిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. ఇంతకుముందు సెషన్ లో తులం బంగారం (24 క్యారెట్స్) ధర రూ.62,650 వద్ద ముగిసింది. మరోవైపు కిలో వెండి ధర సైతం రూ.350 పుంజుకుని రూ.77,950 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 2024 డాలర్లు, ఔన్స్ వెండి 24 డాలర్ల వద్ద స్థిర పడిందని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కమొడిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నవ్ నీత్ దమానీ తెలిపారు.
మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో తులం బంగారం ఫిబ్రవరి డెలివరీ (24 క్యారెట్స్) ధర రూ.195 పెరిగి రూ.61,197 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయంగా న్యూయార్క్లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర (ఔన్స్) 0.04 శాతం తగ్గి 2034.80 డాలర్లు పలికింది.
తమిళనాడు రాజధాని చెన్నైలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.50 తగ్గి రూ.57,850 వద్ద స్థిరపడింది. 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ. 50 క్షీణించి రూ.63,110 వద్ద ముగిసింది. కిలో వెండి ధర రూ.300 పుంజుకుని రూ.80 వేల వద్ద నిలిచింది.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.100 పెరిగి రూ.57,400 పలికింది. పది గ్రాముల బంగారం (24 క్యారెట్స్) ధర రూ.100 పెరిగి రూ.62,620 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.300 పుంజుకుని రూ.80 వేల వద్ద స్థిర పడింది.