72 వేల దిగువకు పసిడి
బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం. పసిడి, వెండిలపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా రెండోరోజు బుధవారం ధరలు భారీగా తగ్గాయి. అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పుత్తడి ధర రూ.72 వేల దిగువకు పడిపోయింది.
- ఇంకో రూ.650 తగ్గిన తులం ధర
న్యూఢిల్లీ, జూలై 24: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా అయితే ఇదే సరైన సమయం. పసిడి, వెండిలపై కస్టమ్ డ్యూటీని తగ్గిస్తూ కేంద్ర సర్కార్ తీసుకున్న నిర్ణయంతో వరుసగా రెండోరోజు బుధవారం ధరలు భారీగా తగ్గాయి. అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో పుత్తడి ధర రూ.72 వేల దిగువకు పడిపోయింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర మరో రూ.650 దిగొచ్చి రూ.71,650కి తగ్గాయని ఆల్ ఇండియా సరాఫ అసోసియేషన్ వెల్లడించింది. అంతకుముందు ఈ ధర రూ.72,300గా ఉన్నది. గడిచిన రెండు రోజుల్లోనే ధరలు రూ.4 వేల స్థాయిలో తగ్గినట్టు అయింది. కానీ, వెండి ధరలు యథాతథంగా రూ.87,500 వద్ద ఉన్నాయి. కానీ, హైదరాబాద్‌లో మాత్రం ధరల్లో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదు. 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.70,860 వద్ద ఉండగా, 22 క్యారెట్ ధర రూ.64,950 వద్ద స్థిరంగా ఉన్నాయి. కానీ, వెండి మాత్రం రూ.500 తగ్గి రూ.92 వేలకు జారుకున్నది. కానీ, అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. ఔన్స్ గోల్డ్ ధర ఆరు డాలర్లు పెరిగి 2,461.20 డాలర్లకు చేరుకోగా, వెండి 29.38 డాలర్ల వద్ద ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IMD Weather | ఈ నెలలోనూ ఎండలెక్కువే..! చలి తీవ్రత పెరగాల్సిన సమయంలో భిన్న వాతావరణం
Omar Abdullah | జమ్ము కశ్మీర్ సీఎంపై 24 మంది ఎమ్మెల్యేల అసంతృప్తి.. నలుగురు మంత్రులు, సీఎం సలహాదారును తొలగించాలని డిమాండ్
Illegal Egg Donation | ఒక్కో అండం రూ. 3 లక్షలు..! డబ్బు ఆశ చూపి వ్యాపారం.. హాస్టళ్ల ముసుగులో దందా
Narsingi Big Road | ఒక్క బిల్డర్ కోసం మాపై బుల్డోజరా?.. ప్రభుత్వం తీరుపై భగ్గుమన్న ‘బిగ్’ రోడ్ బాధితులు
IDBI Bank | అగ్గువకు ఐడీబీఐ..! నిరుడు బ్యాంక్ లాభం 10 వేల కోట్లు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

