Gold Price | నాగపూర్, మార్చి 9: బంగారం ధరలు మరో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారం రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పుత్తడి మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి ఎగిసింది. కమోడిటీ ఫ్యూచర్ మార్కెట్లో రూ.65 వేలు దాటి తులం బంగారం ధర శనివారం రూ.66 వేలను తచ్చాడింది. ప్రస్తుత నెలలో ఇప్పటి వరకు బంగారం ధర రూ.2,700కి పైగా పెరిగింది.
వచ్చే సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలున్నాయని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్మన్ జెరోమ్ పోవెల్ ప్రకటనతో బంగారం ధరలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 2,152 డాలర్లు పలికింది. అలాగే ఫ్యూచర్ మార్కెట్లో 2,158.50 డాలర్ల వద్ద ఉన్నది. అధిక ధరలతో బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి.