న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: బంగారం ధరలు క్రమేణా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో తులం రేటు రూ.2,900 దిగింది. మంగళవారం ఒక్కరోజే రూ.2,150 పడిపోగా.. సోమ, బుధవారాల్లో మరో రూ.750 క్షీణించింది. దీంతో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల విలువ రూ.1,58,100గా ఉన్నది. ఇక హైదరాబాద్లో బుధవారం 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం పుత్తడి ధర రూ.950 తగ్గి రూ.1,41,450గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు పెరుగుతున్నాయి. కిలో ధర మంగళ, బుధవారాల్లో రూ.2,900 పుంజుకున్నది. బుధవారం ఒక్కరోజే రూ.2,300 ఎగిసింది. ఫలితంగా రూ.2,43,400కు చేరింది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 43.67 డాలర్లు పెరిగి 4,399.22 డాలర్లుగా ఉన్నది. సిల్వర్ 66.25 డాలర్లుగా నమోదైంది.