న్యూఢిల్లీ/హైదరాబాద్, జూలై 15: బంగా రం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.300 తగ్గి రూ.49,970కి దిగింది. పసిడితోపాటు వెండి భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్ళు అంతంతే ఉండటంతో కిలో వెండి ఏకంగా రూ.1,075 తగ్గి రూ.54,320కి దిగింది. అటు హైదరాబాద్‌లోనూ బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.430 తగ్గి రూ.51 వేల దిగువకు రూ.50,730కి జారుకున్నది. 22 క్యారెట్ల ధర రూ.400 తగ్గి రూ.46,500కి చేరుకున్నది. కిలో వెండి ఏకంగా రూ.1,900 తగ్గి రూ.60,400 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు భారీగా తగ్గినప్పటికీ దేశీయంగా ఆ స్థాయిలో తగ్గడం లేదు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,703 డాలర్లుగాను, వెండి 18.23 డాలర్లుగా ఉన్నది.