మరింత తగ్గిన పుత్తడి
బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన గోల్డ్ ధరలు ప్రస్తుతం దిగువముఖం పట్టాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 10 : బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. దీపావళి, ధంతేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో దూసుకుపోయిన గోల్డ్ ధరలు ప్రస్తుతం దిగువముఖం పట్టాయి. దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.500 తగ్గి రూ.1,46,400కి చేరుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లలో డిమాండ్ పడిపోవడం, డాలర్ స్థిరంగా ఉండటంతో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయని బంగారం వర్తకులు వెల్లడించారు. బంగారంతోపాటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అంతంత మాత్రంగానే ఉండటంతో కిలో వెండి రూ.1,92,500 వద్ద ఉన్నది.
గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 27 డాలర్లు లేదా ఒక్క శాతం తగ్గి 4,113.55 డాలర్లకు పడిపోగా, వెండి కూడా ఒక్కశాతం తగ్గి 52.77 డాలర్లుగా నమదైంది. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాల ముందు చమురు ధరలు తగ్గడంతో ద్రవ్యోల్బణ ఆందోళనలు తగ్గుముఖం పట్టాయని, దీంతో ఔన్స్ గోల్డ్ 4,100 డాలర్ల స్థాయికి పడిపోయిందని విశ్లేషకులు వెల్లడించారు. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతుండటంతో ఇంధన ధరలు భారీగా పడిపోవడం కూడా ధరలు తగ్గడానికి ప్రధాన కారణమన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరింత తగ్గిన పుత్తడి
మూడో టెస్టు డ్రా
Sweet Corn | మీ డైట్లో స్వీట్ కార్న్ ఉందా.. అయితే మీ ఆరోగ్య సమస్యలకు మీరు చెక్ పెడుతున్నట్టే..!
Rinku Singh | సమాజ్‌వాది పార్టీ ఎంపీని పెళ్లి చేసుకోబోతున్న క్రికెటర్ రింకూ సింగ్.. ఆమె ఎవరంటే..!
Pregnancy | 30 ఏళ్ల వయస్సులో గర్భం దాల్చడం కష్టమవుతుందా.. అండాల సంఖ్య తగ్గుతుందా..?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

