పసిడి పరుగు రూ.2 వేలు పెరిగిన తులం ధర
బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి విలువ గురువారం ఏకంగా రూ.2 వేలు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు డాలర్‌కు డిమాండ్ పడిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 30: బంగారం మళ్లీ ప్రియమవుతున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన పుత్తడి విలువ గురువారం ఏకంగా రూ.2 వేలు ఎగబాకింది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఊపందుకోవడంతోపాటు డాలర్‌కు డిమాండ్ పడిపోవడంతో మదుపరులు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాల వైపు మళ్లించడంతో వీటి ధరలు పుంజుకున్నాయని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.2 వేలు లేదా 1.31 శాతం అందుకొని రూ.1,54,800కి చేరుకున్నది.
అంతకుముందు ఇది రూ.1,52,800గా ఉన్నది. నెల కనిష్ఠ స్థాయికి పడిపోయిన గోల్డ్ ధరలు మళ్లీ పుంజుకున్నాయని, డాలర్ బలహీనపడటం, బాండ్ ఈల్డ్ తగ్గుముఖం పట్టడం కూడా ధరలు పెరుగడానికి ప్రధాన కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు. మరోవైపు, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కిలో వెండి రూ.1,800 తగ్గి రూ.2,42,700కి దిగొచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 91.80 డాలర్లు లేదా 2 శాతం అందుకొని 4,635.52 డాలర్లకు చేరుకోగా, వెండి 3.31 శాతం ఎగబాకి 73.69 డాలర్లు పలికింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ తీసుకున్న నిర్ణయం కూడా ధరలు పెరుగడానికి దోహదం చేశాయన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

