మళ్లీ పెరిగిన పుత్తడి.. రూ 1,200 అధికమైన పదిగ్రాముల ధర
గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 అందుకొని రూ.1.44 లక్షలకు చేరుకున్నది.
న్యూఢిల్లీ, మార్చి 24: గత నాలుగు రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి. దేశీయ బులియన్ మార్కెట్లో పదిగ్రాముల బంగారం ధర రూ.1,200 అందుకొని రూ.1.44 లక్షలకు చేరుకున్నది. కానీ వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన గోల్డ్ ధర సోమవారం రూ.1,43,600 వద్ద నిలిచింది.
అంతర్జాతీయ మార్కెట్లో కమోడిటీ ఉత్పత్తుల ధరలు తిరిగి పుంజుకోవడం వల్లనే దేశీయంగా బంగారం ధర పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. గ్లోబల్ మార్కెట్లో గత తొమ్మిది రోజులుగా తగ్గుతూ వచ్చిన ఔన్స్ గోల్డ్ ధర 16.96 డాలర్లు బలపడి 4,423.83 డాలర్లకు ఎగబాకగా, వెండి 1.03 శాతం అందుకొని 69.86 డాలర్లకు చేరుకున్నది.
ఇరాన్‌పై వచ్చే ఐదురోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈక్విటీ మార్కెట్లతోపాటు బులియన్ మార్కెట్లు ఎగువ ముఖం పట్టాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

