Gold Rate | బంగారం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. 100 గ్రాముల బంగారంపై రూ.100 తగ్గింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో ఫ్యూచర్స్ పసిడి పది గ్రాముల ధర రూ.49,302లకు చేరుకున్నది. దీంతో వివాహ వేడుకల వేళ సామాన్యులు స్వల్పంగా బంగారం ధర తగ్గడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర డిసెంబర్ నాటికి 0.02 శాతం తగ్గి.. రూ.49,302 పలుకుతున్నది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 1862.81 డాలర్లు, యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1866.80 డాలర్లు.
దేశంలోని వివిధ నగరాల్లో బంగారం (22 క్యారెట్ల 10 గ్రాములు) ధర వరలు
ఢిల్లీ: రూ. 48,240
ముంబై: రూ. 47,920
చెన్నై : రూ. 46,300
కోల్కతా: రూ. 48,240
బెంగళూరు: రూ. 45,890
హైదరాబాద్: రూ. 45,890
కేరళ : రూ. 45,890
పుణె : రూ. 47,510
అహ్మదాబాద్: రూ. 47,570
జైపూర్ : రూ.48,190
పాట్నా: రూ. 47,510
నాగ్పూర్ : రూ.47,510