న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ( Gold rate ) రూ.41 పెరిగి రూ.47,217కు చేరింది. క్రితం ట్రేడ్లో 10 గ్రాముల 24 క్యారట్ గోల్డ్ రూ.47,176 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధరలు స్థిరంగా కొనసాగడమే ఇవాళ ఢిల్లీలో బంగారం ధర స్థిరంగా ఉండటానికి కారణమని హెచ్డీఎఫ్సీ నిపుణులు తెలిపారు.
ఇదిలావుంటే వెండి ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.667 పెరిగి రూ.61,337కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,004 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ ఔన్స్ బంగారం ధర 1,794 అమెరికన్ డాలర్లు పలుకగా, ఔన్స్ వెండి ధర 22.94 అమెరికన్ డాలర్లు పలికింది.