Gold Imports | ఫిబ్రవరితో పోలిస్తే మార్చిలో భారత దేశ బంగారం దిగుమతి 90శాతానికి తగ్గే అవకాశాలున్నాయి. కరోనా మహమ్మారి తర్వాత కనిష్ఠానికి చేరుతుందని.. అయితే, భారీగా ధరలు పెరుగుదల డిమాండ్‌ను భారీగా దెబ్బతీసిందని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు. దాంతో బ్యాంకులు బంగారం కొనుగోళ్లను తగ్గించడంతో దిగుమతుల్లో భారీగా తగ్గే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో భారత్ 110 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుందని.. మార్చిలో 10-11 టన్నులకు పరిమితమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలో బంగారాన్ని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ రెండోస్థానంలో ఉన్నది. మార్చి నెల ప్రారంభంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది.
దిగుమతుల తగ్గుదల భారత్ వాణిజ్య లోటును తగ్గించడానికి సహాయపడుతుందని, అలాగే రూపీకి సైతం మద్దతు లభించే అవకాశాలున్నాయని అధికారి చెప్పారు. రికార్డు స్థాయిలో అధిక ధరలకు దిగుమతి చేసుకుని డిమాండ్ పెరిగే వరకు వేచిచూడాల్సిన అవసరం లేకపోవడంతో నగల వ్యాపారులు 35 డాలర్ల కంటే ఎక్కువ డిస్కౌంట్లతో కూడా బంగారాన్ని కొనుగోలు చేయడం లేదు. అధిక ధరల కారణంగా వినియోగదారులు పాత బంగారు ఆభరణాల స్థానంలో కొత్త వాటితో భర్తీ చేస్తున్న నేపథ్యంలో నగల వ్యాపారులు బ్యాంకుల నుంచి బంగారం కొనడం మానేశారు. గ్లోబల్ మార్కెట్లో బంగారం పెరిగింది. క్రమంలో బుధవారం బులియన్ మార్కెట్లో బంగారం రూ.150 పెరిగి తులానికి రూ.67వేలకు చేరింది. వెండి కిలోకు రూ.250 తగ్గి రూ.77,250కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 2,180 డాలర్ల వద్ద ఉన్నది.