Gold Rates | అంతర్జాతీయంగా ఆర్థిక ఒడిదొడుకులు.. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్లు బలహీన పడిన నేపథ్యంలో ఇన్వెస్టర్లకు బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా కనిపిస్తున్నది. ఫలితంగా శుక్రవారం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర దాదాపు ఏడాది గరిష్ట స్థాయి రేట్ పలికింది. అమెరికా ఫెడ్ రిజర్వు తన వడ్డీరేట్ల పెంపు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం స్పాట్ గోల్డ్ ఔన్స్ ధర 0.2 శాతం తగ్గినా 2034 డాలర్లు పలికింది. గతేడాది మార్చి 9 తర్వాత ఔన్స్ బంగారం 2000 డాలర్ల మార్క్‌ను దాటడం ఇదే తొలిసారి. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 0.1 శాతం తగ్గి 2052.30 డాలర్లకు చేరుకున్నది.
మరోవైపు, దేశీయ మార్కెట్లోనూ తులం బంగారం (24క్యారట్లు) పైపైకి దూసుకెళ్తున్నది. చెన్నై, కోయంబత్తూర్, మదురై, ఈరోడ్‌లో రూ.62,500 పలికింది. పలు నగరాల్లో రూ.61,800 పలికింది. దీంతో 10 గ్రాముల బంగారం ధర రూ.62 వేల మార్క్‌ను దాటింది. ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారట్ల బంగారం తులం ధర రూ.550 పెరిగి రూ.56,650 పలికింది. ఈ ధరల్లో జీఎస్టీ, స్థానిక పన్నులు కలుపలేదు. ఆయా ప్రాంతాల్లో ఆభరణాల తయారీ సంస్థలకు అనుగుణంగా ధరల్లో మార్పులు చేర్పులు ఉండవచ్చు.
దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర 410 రూపాయలు పెరిగి రూ.77,580 వద్ద స్థిర పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ వెండి ధర 25.88 డాలర్లు పలుకుతున్నది. డాలర్, యూఎస్ బాండ్ల సూచీల ధర క్షీణించడం వల్లే బంగారానికి గిరాకీ పెరిగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
సిటీ ———– 22 క్యారట్లు —— 24 క్యారట్లు
(10గ్రాములు-రూపాయల్లో)
చెన్నై ———- 57,300 ——- 62,500
ముంబై ——— 56,650 ——- 61,800
ఢిల్లీ ———— 56,800 ——- 61,950
కోల్‌కతా ——– 56,650 ——- 61,800
బెంగళూర్ —— 56,700 —— 61,850
హైదరాబాద్ —- 56,650 —— 61,800
కేరళ ———— 56,650 ——- 61,800
పుణె ————- 56,650 ——- 61,800
వడోదర ——— 56,700 ——- 61,850
అహ్మదాబాద్ — 56,700 ——– 61,850
జైపూర్ ——— 56,800 ——- 61,950
లక్నో ———- 56,800 ——- 61,950
కోయంబత్తూర్ — 57,300 ——- 62,650
మదురై ——– 57,300 ——- 62,650
విజయవాడ —- 56,650 —— 61,800
పాట్నా ——— 56,700 —— 61,850
నాగ్‌పూర్ ——- 56,650 ——- 61,800
చండీగఢ్ ——- 56,800 ——- 61,950
సూరత్ ——– 56,700 ——- 61,850
భువనేశ్వర్ —– 56,650 ——- 61,800
మంగళూరు —– 56,700 —— 61,850
విశాఖపట్నం — 56,650 ——- 61,800
నాసిక్ ———– 56,680 ——-61,830
మైసూర్ ———56,700 ——- 61,850
కటక్ ———— 56,650 —— 61,800
దావణగెరె —— 56,700 —— 61,850
బళ్లారి ———- 56,700 —— 61,850
గుర్గావ్ ———- 56,800 —– 61,950
ఘజియాబాద్ — 56,800 —– 61,950
నొయిడా ——– 56,800 ——- 61,950
సేలం ———– 57,300 ——- 62,500
వెల్లూర్ ———- 57,300 ——- 62,500
అమరావతి —– 56,650 —— 61,800
గుంటూరు —— 56,650 —— 61,800
నెల్లూర్ ——— 56,650 —— 61,800
కాకినాడ ——– 56,650 —— 61,800
తిరుపతి ——– 56,650 —— 61,800
కడప ———- 56,650 ——– 61,800
అనంతపురం — 56,650——- 61,800
వరంగల్ ——– 56,650—— 61,800
నిజామాబాద్ —– 56,650—– 61,800
ఖమ్మం ——— 56,650 —— 61,800
బర్హంపురం —— 56,650 —- 61,800
రూర్కేలా ——– 56,650—— 61,800
రాజ్‌కోట్ ——– 56,700—— 61,850
వాసాయి -విరార్ – 56,680—- 61,830
ఔరంగాబాద్ —- 56,650—– 61,800
షోలాపూర్ ——- 56,650—– 61,800
భీవండి ——— 56,680—– 61,830
కొల్హాపూర్ ——- 56,650 —– 61,800
లాతూర్ ——– 56,680—— 61,830
తిరుపూర్ ——- 57,300 —– 62,500
తిరునెల్వేలి — 57,300 —– 62,500
తిరుచ్చి ——— 57,300 —– 62,500
సంబాల్పూర్ —- 56,650 —- 61,800
అమరావతి ——56,650 —– 61,800
ఈరోడ్ ———–57,300 —— 62,500