బుధవారం 03 మార్చి 2021
Business - Jan 11, 2021 , 16:27:18

స్వ‌ల్పంగా పెరిగిన‌ బంగారం ధ‌ర‌లు

స్వ‌ల్పంగా పెరిగిన‌ బంగారం ధ‌ర‌లు

న్యూఢిల్లీ: దేశంలో బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. దేశ రాజ‌ధాని ఢిల్లీలో ఇవాళ 24 క్యార‌ట్‌ల 10 గ్రాముల‌ స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర రూ.389 పెరిగి రూ.48,866కు చేరింది. క్రితం ట్రేడ్‌లో 10 గ్రాముల స్వ‌చ్ఛ‌మైన బంగారం ధ‌ర 48,477 వ‌ద్ద ముగిసింది. రూపాయి మార‌కం విలువ స్వ‌ల్పంగా త‌గ్గ‌డం, అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో విలువైన లోహాల ధ‌ర‌లు పెరుగ‌డం ఇవాళ బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరుగ‌డానికి కార‌ణ‌మ‌య్యాయ‌ని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు. 

ఇవాళ వెండి ధ‌ర‌లు కూడా స్వ‌ల్పంగా పెరిగాయి. ఢిల్లీలో కిలో వెండి ధ‌ర రూ.1,137 పెరిగి రూ.64,726కు చేరింది. క్రితం ట్రేడ్‌లో కిలో వెండి ధ‌ర రూ.63,589 వ‌ద్ద ముగిసింది. ఇక అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఇవాళ ఔన్స్ బంగారం ధ‌ర 1,853 అమెరిక‌న్ డాల‌ర్లు, ఔన్స్ వెండి ధ‌ర 25.14 అమెరిక‌న్ డాల‌ర్లు ప‌లికింది.   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo