Gold Price | మరింత దిగిన పుత్తడి.. రూ.4 వేలు తగ్గిన తులం ధర
Gold Price | బంగారం ధరలు మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.4,100 తగ్గి రూ.1,21,800కి దిగొచ్చింది.
Gold Price | న్యూఢిల్లీ, అక్టోబర్ 28 : బంగారం ధరలు మరింత తగ్గాయి. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4 వేల డాలర్ల దిగువకు పడిపోవడంతోపాటు అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.4,100 తగ్గి రూ.1,21,800కి దిగొచ్చింది. సోమవారం ఈ ధర రూ.1,25,900గా నమోదైంది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర ఇంతే స్థాయిలో తగ్గి రూ.1,21,200కి చేరుకున్నది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధర మంగళవారం మూడు వారాల కనిష్ఠ స్థాయికి పడిపోయిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. పసిడితోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. కిలో వెండి ఏకంగా రూ.6,250 తగ్గి రూ.1,45,000కి తగ్గింది. గత రెండు రోజుల్లో గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ ధర 200 డాలర్లకు పైగా తగ్గడంతో 3,887 డాలర్లకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గించే అవకాశాలుండటం కూడా పసిడి ధరలు తగ్గడానికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
880 మెట్రిక్ టన్నులకు..
ఈ ఏడాది సెప్టెంబర్ ఆఖరునాటికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దగ్గరున్న బంగారం నిల్వలు 880 మెట్రిక్ టన్నులకు చేరాయి. గడిచిన ఏడాది కాలంలో 25.45 మెట్రిక్ టన్నులు పెరిగినట్టు మంగళవారం 2025 ఏప్రిల్-సెప్టెంబర్ విదేశీ మారకపు నిల్వల నిర్వహణపై విడుదలైన ఆర్బీఐ అర్ధ వార్షిక నివేదిక తెలియజేసింది. గత ఏడాది సెప్టెంబర్ ఆఖర్లో ఆర్బీఐ వద్ద 854.73 మెట్రిక్ టన్నులుగా ఉన్న పసిడి నిల్వలు.. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 880.18 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. ఇందులో 575.82 మెట్రిక్ టన్నులు దేశీయంగానే ఉండగా, మిగతా వాటిని విదేశాల్లో ఆర్బీఐ నిల్వ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద 290.37 మెట్రిక్ టన్నులుండగా, 13.99 మెట్రిక్ టన్నులు గోల్డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఈ సెప్టెంబర్ 30 నాటికి ఆర్బీఐ ఫారెక్స్ నిల్వల్లో బంగారం వాటా 13.92 శాతంగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

