న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.199 తగ్గి రూ.46,389కి చేరింది. క్రితం ట్రేడ్లో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,588 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలో విలువైన లోహాల ధర స్వల్పంగా తగ్గడం, ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ కాస్త బలపడటం దేశీయంగా బంగారం ధరలు తగ్గడానికి కారణమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు తెలిపారు.
ఇక వెండి ధరలు కూడా ఇవాళ స్వల్పంగా తగ్గాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.250 తగ్గి రూ.62,063కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.62,313 వద్ద ముగిసింది. మరోవైపు ఫారెక్స్ మార్కెట్లో రూపాయి మారకం విలువ ఇవాళ 31 పైసలు బలపడి రూ.73.38కి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,814 అమెరికన్ డాలర్లు, ఔన్స్ వెండి ధర 23.99 అమెరికన్ డాలర్లు పలికింది.