న్యూఢిల్లీ, ఆగస్టు 31: బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. వరుసగా నాలుగోరోజూ సోమవారం కూడా బంగారం రూ.1.61 లక్షల దిగువకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు తగ్గుముఖం పట్టాయని ట్రేడర్లు వెల్లడించారు. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర రూ.1,500 దిగొచ్చి రూ.1,60,900గా నమోదైంది. అంతకుముందు ఇది రూ.1,62,400గా ఉన్నది. గత నాలుగు రోజుల్లో గోల్డ్ రూ.6,200 తగ్గినట్టు అయింది.
గత కొన్ని వారాలుగా పెరుగుతు వచ్చిన గోల్డ్ ధరలు దిద్దుబాటుకు గురయ్యాయని లెమనన్ మార్కెట్స్ డెస్క్ రీసర్చ్ హెడ్ గౌరవ్ గార్గ్ తెలిపారు. బంగారం ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ వెండి ధరలు మాత్రం యథాతథంగా నమోదయ్యాయి. మరోవైపు కిలో వెండి రూ.2,45,500గా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,448.56 డాలర్లకు పడిపోగా, వెండి 66.97 డాలర్లకు చేరుకున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య మళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఇంధన ధరలు పెరుగుతుండటంతో గోల్డ్ ధరలు దిగొచ్చాయని చెప్పారు.