Gold Rates | అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా దేశీయ బులియన్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్స్ బంగారం తులం ధర రూ.150 తగ్గి రూ.61,900 వద్ద ముగిసిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ తెలిపింది. కిలో వెండి ధర సైతం రూ.150 పతనమై రూ.75,750 వద్ద స్థిర పడింది.
గ్లోబల్ మార్కెట్లలోనూ బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఔన్స్ బంగారం ధర 1989 డాలర్లు, ఔన్స్ వెండి ధర 22.90 డాలర్లు పలికాయి. మంగళవారం పొద్దుపోయిన తర్వాత అమెరికా రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనుండటం.. తదనుగుణంగా యూఎస్ ఫెడ్ రిజర్వు ఆధ్వర్యంలోని ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ పాలసీ కమిటీ సమావేశం తీర్మానాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి స్పందిస్తున్నారని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ కమొడిటీస్ సీనియర్ అనలిస్ట్ సౌమిల్ గాంధీ తెలిపారు.