Gold Rate | మీరు బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్నారా.. అయితే శుభవార్త. మంగళవారం బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. మంగళవారం ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల (24 క్యారెట్ల) బంగారం ధర రూ.810 తగ్గి, రూ.46,896లకు చేరింది. సోమవారం ట్రేడింగ్‌లో తులం బంగారం ధర రూ.47,706గా ఉంది.
వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. కిలో వెండిపై రూ.1,548 తగ్గింది ఇంతకుముందు రోజు ట్రేడింగ్‌లో రూ.64,268 పలికిన కిలో వెండి ధర ప్రస్తుతం రూ.62,720కి దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పతనం అయ్యాయి. డాలర్‌తో రూపాయి విలువ క్షీణించినా ఢిల్లీలో బంగారం ధర రూ.810 తగ్గిందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ సీనియర్ విశ్లేషకుడు తపన్ పటేల్ చెప్పారు.
అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం 1806 డాలర్లు కాగా, ఔన్స్ వెండి ధర 25.05 డాలర్లు పలుకుతోంది. అయినా అన్ని పన్నులతో కలిపి హైదరాబాద్‌లో తులం బంగారం రూ.49,250 పలికింది. సోమవారం ట్రేడింగ్‌లో అది రూ.49,900గా ఉంది.