Gold | ధనత్రయోదశి సందర్భంగా బంగారం, వెండి కొనుగోళ్లు పెరిగాయి. ప్రస్తుతం పసిడి ధరలు సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అయితే, గతేడాదితో పోలిస్తే డిమాండ్ 15శాతం తగ్గే అవకాశం ఉన్నది. హిందూ క్యాలెండర్లో ధంతేరాస్‌కు ప్రత్యేకత ఉన్నది. ఈ రోజున చాలా మంది బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో బంగారం ధరలు తులానికి రూ.1,34,800కి చేరింది. గతేడాది అక్టోబర్ 29న వచ్చిన ధనత్రయోదశి రోజున బంగారం తులం రూ.81,400 ధర పలికింది. ప్రస్తుతం వెండి ధర కిలోకు రూ.1.77లక్షలుగా ఉంది. పండుగల సమయంలో షాపింగ్‌కు సిద్ధంగా ఉన్నట్లు ఇండియా జెమ్ అండ్ జువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ (GJC) చైర్మన్ రాజేష్ రోక్డే పేర్కొన్నారు. విలువ పరంగా బంగారం అమ్మకాలు వార్షికంగా 40 నుంచి 45 శాతం పెరుగుతాయని జీజేసీ అంచనా వేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సెంకో గోల్డ్ అండ్ డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సువంకర్ సేన్ మాట్లాడుతూ.. బంగారం, వెండి ధరలు భారీగా ఉండడంతో అమ్మకాలను 12శాతం నుంచి 15శాతం వరకు ప్రభావితం చేస్తాయని.. విలువపరంగా 20-25శాతం పెరుగుదల ఉంటుందన్నారు. కొందరు వినియోగదారులు అధిక ధరల సమయంలోనూ బంగారం ధరలు కొనుగోలు చేస్తున్న.. చాలామంది వెండి వైపు.. ముఖ్యంగా బులియన్ వైపు దృష్టి సారిస్తున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ధన్తేరాస్పై బంగారు ఆభరణాల అమ్మకాలు పరిమాణం పరంగా 10 శాతం తగ్గుతాయని జీఏజీ మాజీ అధ్యక్షుడు సన్యామ్ మెహ్రా తెలిపారు. ఆభరణాల దిగుమతులపై నిషేధం కారణంగా గత నెల నుంచి వెండి ధరల పెరుగుదలకు దారితీసిందని చెప్పారు. 2025 నాటికి బంగారం ధరలు అనేక రికార్డు స్థాయిలో గరిష్టాలను చేరినప్పటికీ.. సెప్టెంబర్ చివరి నాటికి రూపాయి విలువలో దాదాపు 51.2 శాతం వార్షిక పెరుగుదల ఉన్నప్పటికీ వినియోగదారుల సెంటిమెంట్, డిమాండ్ సానుకూలంగానే ఉందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇండియా రీజినల్ సీఈవో సచిన్ జైన్ తెలిపారు.
సెప్టెంబర్‌లో భారత్‌లో 902 మిలియన్ డాలర్ల గోల్డ్ ఈటీఎఫ్‌లు నమోదయ్యాయి. ఈ ఏడాది ఆగస్టులో మొత్తం బంగారం దిగుమతులు తొమ్మిది నెలల గరిష్ట స్థాయికి చేరుకుందన్నారు. దీపావళి సందర్భంగా, వివాహాల సీజన్ నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు బంగారానికి డిమాండ్ కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. ఇటీవల రిటైలర్లు నిల్వల విషయంలో జాగ్రత్తగా ఉన్నారని.. వివాహ సంబంధిత డిమాండ్ కొనుగోళ్లను మరింత వేగవంతమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. బంగారం అమ్మకాలకు ఉత్సాహభరితమైన పండుగ సీజన్‌ను సూచిస్తుందని.. అధిక క్యారెట్ బంగారు ఆభరణాల నుంచి డిజిటల్ బంగారం, నాణేలు, ఈటీఎఫ్‌ల వంటి పెట్టుబడి ఉత్పత్తుల వరకు, వివిధ రకాల బంగారు ఉత్పత్తులలో కొనుగోళ్లు బలంగా ఉంటాయని భావిస్తున్నారు. బంగారం ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ.. వినియోగదారుల తేలికైన ఆభరణాల వైపు మళ్లుతున్నారని కామా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ కాలిన్ షా తెలిపారు. పండుగ సీజన్లో 9 నుంచి 18 క్యారెట్ల విభాగంలో ఆభరణాలకు డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని షా చెప్పారు. మొత్తం అమ్మకాలలో 18-20 శాతం పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నట్లు వివరించారు.