పసిడి, వెండి పరుగో పరుగు
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగుపెట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెల్లరీలు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోలు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇరు అతి విలువైన లోహాల ధరలు 5 శాతం వరకు ఎగబాకాయి.
- రూ.12 వేలు పెరిగిన కిలో వెండి
- రూ.3 వేలు అధికమైన తులం పుత్తడి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగుపెట్టాయి. అక్షయ తృతీయ సందర్భంగా జ్యువెల్లరీలు, స్టాకిస్టులు ఎగబడి కొనుగోలు జరపడంతో దేశ రాజధాని న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో ఇరు అతి విలువైన లోహాల ధరలు 5 శాతం వరకు ఎగబాకాయి. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోలు ఊపందుకోవడంతో కిలో వెండి ఏకంగా రూ.11,800 లేదా 4.81 శాతం ఎగబాకి రూ.2.57 లక్షలకు చేరుకున్నది. సోమవారం ఈ ధర రూ.2,45,200గా ఉన్నది.
అలాగే 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగా రం ధర రూ.3 వేలు లేదా 2 శాతం ఎగబాకి రూ.1.58 లక్షలకు చేరుకున్నది. అంతకుముందు ఇది రూ.1.55 లక్షలుగా ఉన్నది. ఈ నెల 19న అక్షయ తృతీయ సందర్భంగా విలువైన లోహాల కొనుగోలుకు శుభదినంగా పాటిస్తారు కనుక ఎగబడి కొనుగోలు జరుపుతారు. అంతర్జాతీయ మార్కెట్లో లోహాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ దేశీయంగా ధరలు పుంజుకోవడం విశేషం. ఔన్స్ గోల్డ్ ధర 45.88 డాలర్లు లేదా ఒక్క శాతం తగ్గి 4,795.97 డాలర్లకు తగ్గగా, వెండి 1.2 శాతం తగ్గి 78.61 డాలర్లకు దిగొచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

