న్యూఢిల్లీ, మే 7 : బంగారం, వెండి ధరలు మరింత పెరిగాయి. క్రూడాయిల్, డాలర్ తగ్గుముఖం పట్టడంతో మదుపర్లు తమ పెట్టుబడులను సురక్షితమైన అతి విలువైన లోహాలకు మళ్లించడంతో వరుసగా రెండోరోజూ గురువారం వీటి ధరలు అధికమయ్యాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర రూ.600 అందుకొని రూ. 1.56 లక్షలకు చేరుకున్నది. పసిడితోపాటు వెండి పరుగులు పెట్టింది.
కిలో వెండి ఏకంగా రూ.7 వేలు అధికమై రూ.2,61,500 పలికింది. పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి డిమాండ్ అధికం కావడంతో వరుసగా నాలుగో రోజూ కూడా ఎగబాకిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. వరుసగా రెండు రోజుల్లో బంగారం రూ.3,500 ఎగబాకగా, వెండి రూ.10 వేలు పుంజుకున్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 4,734.28 డాలర్లకు చేరుకోగా, వెండి ఐదు శాతం బలపడి 81.35 డాలర్లకు ఎగబాకింది.