Gold Price | ఈ వారం బంగారం, వెండి ధరలు బాగానే పెరిగాయి. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెల్లర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) వెబ్సైట్ నివేదిక ప్రకారం వారంలో తులం బంగారం ధర రూ.642 పెరిగి రూ.48,791 వద్ద ముగిసింది. ఈ నెల 13న తులం బంగారం ధర రూ.48,109గా ఉంది.
ఐబీజేఏ వెబ్సైట్ ప్రకారం కిలో వెండి ధర ఈ వారంలో రూ.870 పెరిగి రూ.62 వేలకు చేరువలో ఉంది. ఈ నెల 13న కిలో వెండి ధర రూ.60,941 కాగా, ఇప్పుడు రూ.61,811కి చేరుకున్నది.
గతేడాదితో పోలిస్తే బంగారం ధర రూ.1000 తక్కువ. కరోనా తొలి, సెకండ్ వేవ్‌ల టైంలో శరవేగంగా బంగారం ధర పెరిగిపోయింది. 2020 డిసెంబర్ 18న తులం బంగారం ధర రూ.50,194 పలికింది. అంతకుముందు గతేడాది ఆగస్టులో ఆల్‌టైం రికార్డు నెలకొల్పిన బంగారం తులంధర రూ.56 వేలు దాటింది. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత క్రమంగా బంగారం ధర తగ్గుతూ వచ్చింది.
ఈ నెలాఖరు నాటికి తులం బంగారం ధర రూ.50 వేలకు చేరుతుందని ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ కమొడిటీ అండ్ కరెన్సీ ట్రేడ్ ఉపాధ్యక్షుడు అనూజ్ గుప్తా చెప్పారు. కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరగడమే దీనికి కారణం అన్నారు. డాలర్‌పై రూపాయి మారకం విలువ పడిపోవడంతో బంగారం ధర పెరుగుతున్నదని చెప్పారు. మున్ముందు బంగారం ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు.
అమెరికా ఫెడ్ రిజర్వుతోపాటు పలు ప్రధాన దేశాల కేంద్రీయ బ్యాంకులు ఉద్దీపన ప్యాకేజీలు ఉపసంహరించుకోవడంతోపాటు వడ్డీరేట్లు పెంచుతున్నాయి. దీనికితోడు ఒమిక్రాన్ వ్యాప్తితోపాటు ద్రవ్యోల్బణం అంతకంతకు పెరుగుతున్నది. డాలర్‌పై రూపాయి మారకం విలువ పతనం కావడం కూడా బంగారం ధర ప్రియం కావడానికి కారణమవుతున్నది. దీంతోపాటు హాల్‌మార్కింగ్ ఉన్న బంగారాన్ని కొనుగోలు చేయడమే ఉత్తమం అని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
క్యారట్ల వారీ బంగారం ధరవరలు:
క్యారట్స్ —— ధర (రూ||ల్లో)
(10 గ్రాములు)
24 — — — 48,791
23 — — — 48,596
22— —- — 44,693
18 — —- – 36,593