హైదరాబాద్, ఏప్రిల్ 23: సెక్యూరిటీ సొల్యూషన్స్ పరికరాల సంస్థ గోద్రెజ్ ఎంటర్ప్రైజెస్ గ్రూపు.. తాజాగా స్మార్ట్ సెక్యూరిటీ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భద్రతాపరంగా పెరుగుతున్న సవాళ్లను అధిగమించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ నూతన శ్రేణి పరికరాలు వ్యక్తిగత వినియోగదారులతోపాటు సంస్థాగత అవసరాలకోసం వినియోగించుకోవచ్చునని కంపెనీ బిజినెస్ హెడ్ పుష్కర్ గోఖలే తెలిపారు.