హైదరాబాద్, మార్చి 21:జెర్సీ బ్రాండ్‌తో పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న గోద్రేజ్ ఆగ్రోవెట్ రాష్ట్ర మార్కెట్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. తెలంగాణలో పాల ఉత్పత్తులను విక్రయించడం ద్వారా వచ్చే రెండేండ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ సీఈవో భూపేం ద్ర సూరి తెలిపారు. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ.650 కోట్లుగావున్నది.
వ్యాపార వ్యూహాత్మక విస్తరణలో భాగంగా మార్కెట్లోకి సరికొత్త ఉత్పత్తులను ఆయన విడుదల చేశారు. అలాగే వచ్చే ఏడాదిలో తెలంగాణతోపాటు ఏపీల్లో అవుట్లెట్లను 20 వేలకు పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.