హైదరాబాద్, ఆగస్టు 9: జీఎమ్మార్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా నష్టాల్లోకి జారుకున్నది. జూన్‌తో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 217 కోట్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది. క్రితం ఏడాది సంస్థ రూ.201 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ ఆదాయం మాత్రం రూ.1,163 కోట్ల నుంచి రూ.1,190 కోట్లకు ఎగబాకినట్లు వెల్లడించింది.