హైదరాబాద్, అక్టోబర్ 8: హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కోసం జీఎమ్మార్ గ్రూప్ రూ.6,300 కోట్ల పెట్టుబడులను పెడుతున్నది. 2024కల్లా ఎయిర్పోర్టు వార్షిక ప్రయాణీకుల సామర్థ్యాన్ని 3.4 కోట్లకు పెంచాలన్న లక్ష్యంలో భాగంగానే ఈ పెట్టుబడులను పెడుతున్నట్లు జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ డిప్యూటీ సీఈవో ఆంటోనీ క్రాంబెజ్ తెలిపారు. శుక్రవారం ఇక్కడ ఇండో-ఫ్రెంచ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఐఎఫ్సీసీఐ) నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న ఆంటోనీ పీటీఐతో మాట్లాడుతూ బాండ్ల జారీ ద్వారా నిధులను సమీకరించామన్నారు.