జైసల్మేర్, డిసెంబర్ 11: జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. వాహన ధరలను మరోసారి పెంచడానికి సిద్ధమవుతున్నది. యూరో తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పతనమవడంతో వచ్చే నెలలో ధరలు పెంచకతప్పదని కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో హర్దీప్ సింగ్ బ్రార్ తెలిపారు.
ఇప్పటికే సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను మూడు శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సంస్థ రూ.45.3 లక్షలు మొదలుకొని రూ.2.54 కోట్ల లోపు ధర కలిగిన పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్నది. ఈ ఏడాది యూరోతో పోలిస్తే రూపాయి విలువ 93 నుంచి 95 స్థాయిలో ఉంటుందని అంచనావేసినప్పటికీ ప్రస్తుతం 103-105 స్థాయికి పడిపోయిందని, దీంతో ధరలు పెంచకతప్పదని ఆయన చెప్పారు.