హైదరాబాద్, జూలై 6: లార్డ్స్ మార్క్ ఇండస్ట్రీస్‌కు చెందిన లార్డ్స్ మైక్రోబయోటెక్…హైదరాబాద్‌లో జీనోమ్ టెస్టింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. లాలాజలంతో శరీరంలో ఉండే రోగాలను గుర్తించే ఈ టెస్ట్‌తో అన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.
రక్తంతో పనిలేకుండా కేవలం లాలాజలంతోనే శరీరంలో ఉండే రోగాలను గుర్తించవచ్చునని, ఇందుకోసం రూ.8 వేల నుంచి రూ.16 వేల మధ్యలో చార్జీ వసూలు చేయనున్నట్టు కంపెనీ ఫౌండర్ సచ్చిదానంద్ ఉపాధ్యాయ తెలిపారు.