Gemini App | అమెరికాలో జరిగిన ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ టెక్నాలజీ ఇన్ ఎడ్యుకేషన్ (ISTE) కాన్ఫరెన్స్ గూగుల్ విద్యా రంగానికి సంబంధించి పెద్ద మొత్తంలో కొత్త ఏఐ టూల్స్‌ని లాంచ్ చేసింది. జెమినీ ఇన్ క్లాస్ రూమ్ పేరుతో కొత్త సిరీస్‌ను పరిచయం చేసింది. ఇందులో 30కిపైగా కొత్త ఏఐ టూల్స్‌ని ఉపాధ్యాయుల కోసం రూపొందించింది. అంతే కాకుండా విద్యార్థుల కోసం జెమిని ఫర్ స్టూడెంట్స్ యాప్‌ను గూగుల్ విడుదల చేసింది. గూగుల్ బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్న ప్రకారం.. ఈ AI టూల్స్ అన్నీ గూగుల్ వర్క్‌స్పేస్ ఫర్ ఎడ్యుకేషన్ యూజర్లకు పూర్తిగా ఉచితంగానే అందుబాటులో ఉంటాయి. గత ఏడాది గూగుల్ క్లాస్ రూమ్‌కి జెమినీ ఫీచర్స్‌ను చేర్చిన తర్వాత ఈ భారీ అప్డేట్ను ప్రకటించింది.
ఈ టూల్స్ ద్వారా ఉపాధ్యాయులు AI సహాయంతో పాఠ్య ప్రణాళికలు తయారు చేసుకోవచ్చు. ఆటోమేటిక్ క్విజ్స్, ప్రజెంటేషన్స్, వర్క్‌షీట్స్‌ను తయారు చేసుకోవచ్చు. ప్రాజెక్టు ఐడియాలకు బ్రెయిన్ స్టామింగ్ టూల్స్‌ని ఉపయోగించుకునే అవకాశం ఉండడంతో పాటు చదువును ఆటలుగా మార్చే సౌలభ్యం కల్పించింది. నోట్‌బుక్ ఎల్ఎం సహాయంతో ఉపాధ్యాయులు స్టడీ గైడ్స్, ఆడియో ఓవర్ వ్యూలను తయారు చేయగలుగుతారు. జెమినీ ద్వారా ఉపాధ్యాయులు AI నిపుణులను రూపొందించగలుగుతారు. ఇవి విద్యార్థులకు అదనపు సహాయం అందిస్తాయి. ఉపాధ్యాయులు ఇప్పుడు విద్యార్థుల పురోగతిని మెరుగ్గా ట్రాక్ చేయగలుగుతారు.
తొలిసారి సారిగా ఈ ఫీచర్ అమెరికా కే-12, స్టేట్ లర్నింగ్ స్టాండర్డ్స్ అందించనున్నది. అనంతరం ఇతర దేశాల ప్రమాణాలను కూడా ఇందులో చేర్చనున్నారు. విద్యా సంస్థలు తమ సొంత లర్నింగ్ స్టాండర్డ్స్‌ను కూడా గూగుల్ క్లాస్ రూమ్ క్లాస్మేట్ ద్వారా పబ్లిష్ చేయొచ్చు. విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించిన ఈ యాప్ చదువును మరింత సులభతరం చేయడం కోసం రూపొందించింది. ఇందులో ‘జెమినీ కాన్వాస్’ అనే ఫీచర్ ద్వారా విద్యార్థులు ఏవైనా విషయాలపై వ్యక్తిగత క్విజ్స్ సృష్టించొచ్చు. ఇంటరాక్టివ్ డయాగ్రామ్స్, విజువల్స్ సహాయంతో క్లిష్టమైన అంశాలను సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లల భద్రత, గోప్యతకు ప్రాధాన్యం ఇచ్చినట్లు గూగుల్ పేర్కొంది. పిల్లల చాట్స్ ఆధారంగా AI మోడల్‌ను ట్రెయిన్ చేయదని స్పష్టం చేసింది. అలాగే, చైల్డ్ సేఫ్టీ నిపుణుల సూచనలతో దీన్ని రూపొందించామని చెప్పింది.