నాలుగో త్రైమాసికంలో వృద్ధి 7.8 శాతమే
దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి.
- క్యూ3తో పోలిస్తే తగ్గిన జీడీపీ
న్యూఢిల్లీ, మే 31: దేశ జీడీపీ గణాంకాలు ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో నిరాశపర్చాయి. అంతకుముందు త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో 8.6 శాతంగా ఉంటే.. ఈసారి మాత్రం 7.8 శాతానికే పరిమితమయ్యాయి. జూలై-సెప్టెంబర్లో 8.1 శాతంగా, ఏప్రిల్-జూన్లో 8.2 శాతంగా ఉండటంతో.. గత ఆర్థిక సంవత్సరం (2023-24) మొత్తం 4 త్రైమాసికాల్లో చివరి త్రైమాసికంలోనే 8 శాతం దిగువన వృద్ధి నమోదైనైట్టెంది. ఈ మేరకు జాతీయ గణాంకాల కార్యాలయం శుక్రవారం తెలియజేసింది. గత ఆర్థిక సంవత్సరం జీడీపీ 8.2 శాతంగా ఉన్నది. అంతకుముందు 2022-23లో ఇది 7 శాతం..
వ్యవసాయం దిగాలుగా..
దేశంలో ఎంతోమందికి జీవనాధారంగా ఉన్న వ్యవసాయ రంగం దిగాలు పడింది. జనవరి-మార్చిలో వ్యవసాయ రంగ వృద్ధి 0.6 శాతం పడిపోయింది. గతంలో ఇది 7.6 శాతంగా ఉండటం గమనార్హం. దీంతో కేంద్ర ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమన్న విమర్శలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. మోదీ సర్కారు వ్యవసాయ రంగానికి తగినంత ప్రాధాన్యతనివ్వడం లేదని వ్యవసాయ, దాని ఆధారిత పరిశ్రమ వర్గాలు ఒకింత అసహనం వెలిబుచ్చుతున్నాయి.
ద్రవ్యలోటు 5.6 శాతం
గత ఆర్థిక సంవత్సరం (2023-24) కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు.. దేశ జీడీపీలో 5.6 శాతంగా నమోదైంది. ఈ మేరకు శుక్రవారం కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (సీజీఏ) విడుదల చేసిన గణాంకాలు చెప్తున్నాయి. ప్రభుత్వ ఆదాయం కన్నా, వ్యయం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా పరిగణిస్తామన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆదాయ-వ్యయాల మధ్య తేడా రూ.16.53 లక్షల కోట్లుగా ఉన్నది. ఇది జీడీపీలో 5.63 శాతానికి సమానం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు జీడీపీలో 8.2 శాతంగా ఉన్నది. కాగా, ఈసారి నికర పన్ను వసూళ్లు రూ.23.26 లక్షల కోట్లుగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Womens Health | నెలసరి ముందు వచ్చే సమస్యలను తగ్గించుకునేందుకు మహిళలు ట్యాబ్లెట్లను వాడాలా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Parliament: ప్రోరోగ్ కాకుండా 88 రోజులుగా వర్షాకాల సమావేశాలు.. పార్లమెంట్లో కొత్త రికార్డు
OTT Movies | ఓటీటీలో ఈ వారం 14 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్లు.. రణబాలి నుంచి జైలర్ 2 వరకు..!
TV Anchor: పాకిస్థాన్లో టీవీ యాంకర్ కాల్చివేత.. భర్త అరెస్టు
Bodybuilder Venkatesan: హైదరాబాదీ బాడీబిల్డర్ వెంకటేశన్కు మిస్టర్ నేచురల్ వరల్డ్ టైటిల్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

