త్వరలో ప్రారంభించనున్న సంస్థ
ఫరూఖ్‌నగర్ (గురుగ్రామ్): లాజిస్టిక్స్ హబ్‌గా రూపొందుతున్న హైదరాబాద్‌లో ఎక్స్‌ప్రెస్ సర్వీసుల కంపెనీ గతి-కేడబ్ల్యూఈ త్వరలో సర్ఫేస్ ట్రాన్షిప్మెంట్ సెంటర్ (ఎస్టీసీ)ను ఏర్పాటు చేయనుంది. శుక్రవారం హర్యానాలోని ఫరూఖ్‌నగర్‌లో అతిపెద్ద ఎస్టీసీని ప్రారంభించింది. ఈ సందర్భంగా గతి లిమిటెడ్ సీఈవో ఫిరోజ్‌షా సర్కారి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఇండోర్, నాగపూర్‌ల్లో ఎస్టీసీలను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించారు. వచ్చే మూడేండ్లలో దేశవ్యాప్తంగా ఇటువంటి 12 సదుపాయాల్ని నెలకొల్పుతామన్నారు. పార్సిళ్లు, సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు 1.5 లక్షల చదరపు అడుగుల్లో ఫరూఖ్‌నగర్ ఎస్టీసీని ఏర్పాటు చేసారు. ఈ ఆధునిక, ఆటోమేటెడ్ ఎస్‌టీసీల ద్వారా కస్టమర్లకు వేగవంతమైన రవాణా సేవల్ని అందిస్తామని సర్కారి తెలిపారు.