హైదరాబాద్, సెప్టెంబర్ 9: గర్వారే హై-టెక్ ఫిల్మ్స్ లిమిటెడ్..దేశంలో ఆటోమొటివ్ ఫిల్మ్స్, డీటైలింగ్ పరిశ్రమలో తొలిసారిగా నెలవారీ చెల్లింపుల(ఈఎంఐ) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రముఖ మర్చెంట్ కామర్స్, పేమెంట్స్ సేవల సంస్థ పైన్ ల్యాబ్స్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఇరు సంస్థల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా జీహెచ్ఎఫ్ఎల్ కస్టమర్లు తమ కొనుగోళ్లపై ఈఎంఐలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తద్వారా మొత్తం కొనుగోలు వ్యయాన్ని సులభమైన నెలవారీ వాయిదాలుగా విభజించుకొని చెల్లించే అవకాశం లభించనున్నదని కంపెనీ డైరెక్టర్ దీపక్ జోషి తెలిపారు.