జావా సరికొత్త బైకు
ముంబై, సెప్టెంబర్ 9: ప్రముఖ స్పోర్ట్ బైకుల తయారీ సంస్థ జావా..దేశీయ మార్కెట్లోకి 42 ఎఫ్జే, 42 బాబ్బర్ మాడళ్లను పరిచయం చేసింది. దీంట్లో జావా 42 ప్రారంభ ధర రూ.1,79,942గా నిర్ణయించిన సంస్థ.. గరిష్ఠంగా రూ.1,89,942కి విక్రయించనున్నట్టు ప్రకటించింది.
294.7 సీసీ ఇంజిన్తో తయారైన ఈ బైకు సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్, ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 13.2 లీటర్లుతో తీర్చిదిద్దింది.