హైదరాబాద్, ఆగస్టు 22: దేశీయ ప్రముఖ ఫ్యాషన్ రిటై ల్ సంస్థ వీ-మార్ట్.. రాబోయే వినాయక చవితి సందర్భంగా మునుపెన్నడూ లేనివిధంగా గొప్ప ఆఫర్లను ప్రకటించింది. తెలంగాణ, ఏపీసహా ఒడిషా, కర్నాటక, గోవా, పుణెల్లోగల అన్ని వీ-మార్ట్ షోరూంలలో ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 19 నుంచే మొదలైన ఈ పండుగ ఆఫర్లు.. ఈ నెలాఖరుదాకా కొనసాగనున్నాయి. రూ.3వేల కొనుగోలుపై రూ.1,500 డిస్కౌంట్ వోచర్, హెచ్డీఎఫ్సీ డెబిట్, క్రెడిట్ కార్డులపై 7.5 శాతం వరకు రాయితీ వంటి అవకాశాల్ని కల్పించింది.