హైదరాబాద్, డిసెంబర్ 22: దక్షిణ భారతంలోనే అతిపెద్ద ప్లాట్ ప్రమోటర్ ‘జీ స్కేర్ హౌజింగ్’.. హైదరాబాద్‌లో తొలి స్పోర్ట్స్-థీమ్డ్ లగ్జరీ ప్లాట్ కమ్యూనిటీని బీఎన్‌రెడ్డి నగర్లో ప్రారంభించింది. 65 ఎకరాల్లో ‘జీ స్కేర్ ఈడెన్ గార్డెన్’ పేరిట అత్యుత్తమ సదుపాయాలతో దీన్ని అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్రాజెక్టులో 484 ప్రీమియం రెసిడెన్షియల్ ప్లాట్లున్నాయి. జీహెచ్ఎంసీ, టీఎస్ రెరా ఆమోదించిన లే-అవుట్ అని, అన్ని అనుమతులున్నాయని గురువారం ఓ ప్రకటనలో సంస్థ పేర్కొన్నది. ఎల్బీ నగర్ సర్కిల్ నుంచి కేవలం 5 నిమిషాల్లో చేరుకోవచ్చని వివరించింది.