ఫ్యూచర్ రిటైల్‌కు ఎదురుదెబ్బ
ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఆస్తుల్ని రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేందుకు ప్రతిపాదించిన లావాదేవీని సెక్యూర్డ్ రుణదాతలు (ఆస్తుల్ని తనఖా ఉంచుకుని రుణాలిచ్చినవారు) తిరస్కరించారు.
- రిలయన్స్‌తో లావాదేవీకి రుణదాతలు నో
న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: ఫ్యూచర్ రిటైల్ (ఎఫ్ఆర్ఎల్) ఆస్తుల్ని రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేందుకు ప్రతిపాదించిన లావాదేవీని సెక్యూర్డ్ రుణదాతలు (ఆస్తుల్ని తనఖా ఉంచుకుని రుణాలిచ్చినవారు) తిరస్కరించారు. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్‌కు రూ. 24,713 కోట్లకు ఫ్యూచర్ రిటైల్‌ను విక్రయించేందుకు కిషోర్ బియాని నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్ గతంలో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ లావాదేవీపై జరిగిన ఓటింగ్‌లో షేర్హోల్డర్లు, అన్సెక్యూర్డ్ రుణదాతల్లో 75 శాతం ఆమోదించారని, 69.29 శాతం మెజారిటీ సెక్యూర్డ్ రుణదాతలు తిరస్కరించారని ఎఫ్ఆర్ఎల్ శుక్రవారం స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఈ లావాదేవీ పూర్తికావడానికి 75 శాతం సెక్యూర్డ్ రుణదాతలు అనుమతించడం అవసరం. డీల్‌కు 85.94 శాతం మంది షేర్హోల్డర్లు ఆమోదం తెలిపారని కంపెనీ వెల్లడించింది. ఇప్పటికే ఈ లావాదేవీని వ్యతిరేకిస్తూ అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కోర్టుల్లో పోరాటం జరుపుతున్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Reliance Retail
RELATED ARTICLES
తాజా వార్తలు
Plane crash | అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
Actress | “నేను ఈ సినిమా ఫీల్డ్‌కు సరిపోనేమో అనిపిస్తుంది”.. ప్రీ రిలీజ్ వేడుకలో కన్నీళ్లు పెట్టుకున్న నటి
Bigg Boss 10 | బిగ్‌బాస్ హౌస్‌లో రోహిత్‌కు ‘డ్రామా కింగ్’ ట్యాగ్.. షాలినికి విక్టిమ్ కార్డు, ముఖేష్‌కు మానిప్యులేటర్ బిరుదు!
Flyover Projects | ఫ్లైఓవర్ల కింద విద్యుత్ సబ్ స్టేషన్లు.. ప్రజాభద్రతకు ప్రమాదం.. విద్యుత్ రంగ నిపుణులు
TG-SAFE | ఇవి తింటే రోగాలే..! టీజీసేఫ్ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

