Mumbai airport | రన్‌వేపై ఎదురెదురుగా వచ్చిన విమానాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..!
Mumbai airport | ముంబై విమానాశ్రయం (Mumbai airport) లో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వే (Run way) పైకి ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిరిండియా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ రన్‌వేపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండ్ అయ్యింది.
Mumbai airport : ముంబై విమానాశ్రయం (Mumbai airport) లో ఘోర ప్రమాదం తప్పింది. ఒకే రన్‌వే (Run way) పైకి ఎయిర్ ఇండియా (Air India), ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) విమానాలు ఎదురెదురుగా వచ్చాయి. ఎయిరిండియా పైలట్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఓ రన్‌వేపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో అదే రన్‌వే నుంచి టేకాఫ్ అవ్వడానికి ఎయిర్ ఇండియా విమానం ఎదురుగా వచ్చింది.
ఇది గమనించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఎయిర్ ఇండియా విమాన పైలట్‌ను అప్రమత్తం చేయడంతో వెంటనే విమానాన్ని ఆపివేశారు. రెండు విమానాలు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఎదురెదురుగా ఆగిపోవడంతో ప్రమాదం తప్పింది. రెండు విమానాలలోని ప్రయాణికులను సురక్షితంగా కిందకు దించినట్లు అధికారులు వెల్లడించారు. ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సిలిగుడి నుంచి ముంబైకి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
పరీక్షలు నిర్వహించడానికి ఎయిరిండియా విమానాన్ని బేస్‌కు తరలించామని.. ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

