హైదరాబాద్, జూన్ 13 (నమస్తే తెలంగాణ): ఎఫ్టీసీసీఐ వార్షిక ఎక్సలెన్స్ అవార్డుల కోసం అర్హులైన పారిశ్రామికవేత్తల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. ఆన్లైన్ ద్వారా ఎఫ్టీసీసీఐకి నామినేషన్లు పంపించేందుకు ఈ నెల 20 చివరి గడువు అని ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు మేలా జయదేవ్ తెలిపారు. ఎగుమతులు, మార్కెటింగ్, నూతన ఆవిష్కరణలు, ఆర్ అండ్ డీ టెక్నాలజీ తదితర 21 విభాగాల్లో విజేతలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.