న్యూఢిల్లీ, ఆగస్టు 22: ఫ్రీడమ్ ఆయిల్ పేరుతో వంటనూనెలను విక్రయిస్తున్న జెమినీ ఎడబుల్ అండ్ ఫ్యాట్స్ ఇండియా(జీఈఎఫ్) ఐపీవోకి రాబోతున్నట్టు ప్రకటించింది. ఇందుకు సంబంధించి స్టాక్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీకి దరఖాస్తు చేసుకున్నది. ప్రమోటర్లు, ఇన్వెస్టర్లకు చెందిన 4.11 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూట్లో విక్రయించబోతున్నది. ఓఎఫ్ఎస్ రూట్లో ప్రమోటర్లు అల్క చౌదరీ, గోల్డెన్ అగ్రీ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్తోపాటు బ్లాక్ రివర్ ఫుడ్ 2 ప్రైవేట్ లిమిటెడ్, ఇన్వెస్ట్మెంట్, కమర్షియల్ ఎంటర్ప్రైజెస్కు చెందిన షేర్లను విక్రయించనున్నారు.