కొండాపూర్, ఏప్రిల్ 15 : రియల్ ఎస్టేట్ సేవలను అందరికి అందుబాటులోకి తీసుకురావడంలో ఫ్రాక్స్పేస్ స్టార్టప్ కీలకంగా వ్యవహరిస్తున్నదని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నత్రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని టీ – హబ్‌లో శనివారం ఫ్రాక్స్పేస్ స్టార్టప్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంస్థ ఎండీ ఉన్నత్రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాన్యులకు సైతం రియల్ ఎస్టేట్ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఫ్రాక్స్పేస్ పనిచేస్తున్నదని, మధ్య తరగతి ప్రజల కలల సాకారంలో ప్రత్యేక భూమిక పోషించేలా రూపొందించినట్టు తెలిపారు.