నాన్సెన్స్.. అదంతా ఉత్తదే!
2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాం’ అంటూ ఊదరగొడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు.
- 2047కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం కాలేదు
- ప్రస్తుత ఆర్థికవృద్ధి ప్రచారమంతా పెద్ద బూటకం
- వృద్ధిని ఎక్కువ చేసి చూపిస్తున్నారు.. దీంతో నష్టమే
- ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కీలక వ్యాఖ్యలు
- విద్య, ఉద్యోగాల్లో నైపుణ్యాభివృద్ధి ముఖ్యమని వెల్లడి
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): ‘2047నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెడతాం’ అంటూ ఊదరగొడుతున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలన్నీ అబద్దాలేనని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కుండబద్దలు కొట్టారు. ఇలాంటి వాగ్ధానాలపై మాట్లాడటం కూడా అర్థంలేని చర్య (నాన్సెన్స్ టు టాక్)గా అభివర్ణించారు. దేశ ప్రస్తుత ఆర్థికవృద్ధిరేటును కావాలనే ఎక్కువ చేసి చూపిస్తున్నారన్న ఆయన.. భవిష్యత్తులో ఇది దేశానికి నష్టదాయకమేనని హెచ్చరించారు. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ న్యూస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.
రాజన్ కీలక వ్యాఖ్యలు
- కొందరు రాజకీయ నేతలు దేశం వృద్ధిపథంలో నడుస్తున్నదంటూ ఎక్కువగా చేసి చూపిస్తున్నారు. ఇదంతా అబద్ధం.
- ఈ వ్యాఖ్యలను నమ్మితే పెద్ద తప్పు చేసినట్లే. అయితే, దురదృష్టవశాత్తు ఇప్పుడు అదే జరుగుతున్నది.
- ప్రస్తుతం కొందరు చెప్తున్న వృద్ధిరేటును నిజంగా సాధించాలంటే ఇంకా ఎన్నో ఏండ్లు మనం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది.
- ఇప్పటికీ దేశంలో చాలామంది చిన్నారులకు హైస్కూల్ విద్య కూడా అందట్లేదు. స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నది.
- అక్షరాస్యతరేటులో మన దేశ స్థానం మరో ఆసియా దేశమైన వియత్నాం కంటే దిగువన ఉన్నది.
- ఈ పరిస్థితుల్లో 2047నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడం ఎలా సాధ్యమౌతుంది. ఇదంతా అబద్ధం.
- విద్యావ్యవస్థను ప్రక్షాళన చేయడానికి బదులు.. మోదీ సర్కారు చిప్ తయారీ తదితర రంగాలకు ఎక్కువ ప్రోత్సాహకాలు ఇస్తున్నది. ఇది సరైనది కాదు.
- 140 కోట్ల జనాభా ఉన్న భారత్‌లో 30 ఏండ్లలోపు యువశ్రామికశక్తి వాటా సగానికి పైగానే ఉంటుంది.
- అయితే, వారి విద్య, నైపుణ్యాలకు తగిన ఉద్యోగాలు దక్కట్లేదు. ఎప్పుడైతే వారికి తగిన ఉపాధి లభిస్తుందో.. అప్పుడు దేశానికి లాభం చేకూరుతుంది.
- అందుబాటులో ఉన్న శ్రామికశక్తిని సరిగ్గా వినియోగించుకొని, కొత్త ఉద్యోగాలు సృష్టిస్తేనే భారత్ వృద్ధిపథంలో దూసుకుపోతుంది.
- పిల్లి నల్లగా ఉన్నదా? తెల్లగా ఉన్నదా? అనేది సమస్య కాదు. అది ఎలుకను వేటాడి పట్టుకుందా? లేదా? అనేది ముఖ్యం’ అని చైనా మాజీ అధ్యక్షుడు డేంగ్ జియోపింగ్ చెప్పినట్టు .. ఆచరించదగిన విధానాలు ఉన్నప్పుడు అది చైనా అయినప్పటికీ, దాని నుంచి మనం తప్పకుండా నేర్చుకోవాల్సిందే.
- విద్య, ఉద్యోగాల్లో నైపుణ్యాభివృద్ధిని మెరుగుపర్చడం అనేది.. రానున్న ఎన్నికల్లో గెలిచే కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

