హైదరాబాద్, జూలై 24 : ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి అజయ్ సేథ్.. ఐఆర్డీఏఐ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో మూడేండ్లు లేదా 65 ఏండ్ల వయస్సు వచ్చే వరకు కొనసాగనున్నారు.
ఈ ఏడాది మార్చిలో పదవీ విరమణ చేసిన దేబసిస్ పాండే స్థానంలో సేథ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.