Forex Reserves | భారత్ విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) నిల్వలు రికార్డు స్థాయిలో పెరిగి, కీలక మైలురాయిని దాటాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. గత నెల 31తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు 4.8 బిలియన్ డాలర్లు వృద్ధి చెంది 651.5 బిలియన్ డాలర్లకు చేరాయి. ఇప్పటి వరకూ ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో ఇదే జీవిత కాలం గరిష్టం. సర్వీసుల్లో వృద్ధితోపాటు చెల్లింపులు పుంజుకోవడంతో గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కరంట్ ఖాతా లోటు (సీఏడీ) గణనీయంగా తగ్గింది.
ఇదిలా ఉంటే గోల్డ్ రిజర్వు నిల్వలు 212 మిలియన్ డాలర్లు తగ్గి 56.501 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్డీఆర్స్) కూడా 17 మిలియన్ డాలర్లు తగ్గి 18.118 బిలియన్ డాలర్లకు పతనం అయ్యాయి. అంతకుముందు వారం ఓవరాల్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 2.027 బిలియన్ డాలర్లు క్షీణించి 646.673 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. కాగా, గత నెల 10తో ముగిసిన వారానికి ఫారెక్స్ రిజర్వు నిల్వలు 648.87 బిలియన్ డాలర్లకు పుంజుకున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు.